సింహ కోడూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్’. కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్. వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ఫణిదీప్ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా నేడు (శనివారం) గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా హీరో శ్రీసింహా కోడూరి మీడియాతో మాట్లాడుతూ, ‘ఇందులో సూర్య అనే యువకుడి పాత్రలో కనిపిస్తాను. ఇప్పటి వరకు నేను చేసిన నాలుగు సినిమాల్లో ఇది నా క్యారెక్టర్ మీదనే రన్ అవుతుంది. ఎమోషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. నటుడిగా సంతప్తిని ఇచ్చిన సినిమా. ఇందులో హీరో తన ఎమోషన్స్‌ను బైక్ వల్ల కంట్రోల్ చేసుకోగలుగుతాడు. హీరోకి లైఫ్‌లో బైక్ వల్ల చాలా విషయాలు జరుగుతాయి. అందుకనే హీరో తన బైక్‌నే ఉస్తాద్ అని పిలుచు కుంటుంటాడు. ఎలాంటి గోల్‌లేని వ్యక్తి బైక్ వల్ల ఎలా సరైన దారిలో పడ్డాడనేదే కథ. సూర్య కాలేజ్ సమయంలో ఎలా ఉంటాడు, కాలేజ్ తర్వాత లైఫ్‌లో ఏం చేయాలో తెలియని స్థితి. ఫైలట్ అయిన తర్వాత తన లైఫ్ ఎలా సాగుతుందనేది చూడొచ్చు. కాలేజ్ కుర్రాడి పాత్ర చేస్తున్నప్పుడు ఎక్సర్‌సైజులు, స్పెషల్ డైట్ తీసుకుని బరువు తగ్గాను. ఇక మరో పాత్ర కోసం గడ్డం, జుట్టు పెంచాను. ఇలా మూడు వేరియేషన్స్‌లో కనిపించటం అనేది ఛాలెంజింగ్‌గా అనిపించింది’ అని తెలిపారు.