నిరంతరం ప్రజా సేవలోనే ఉంటాను

నవతెలంగాణ – రాయపర్తి
సర్పంచిగా పదవీకాలం పూర్తయిన నిరంతరం ప్రజాసేవలో ఉంటానని రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య అన్నారు. గ్రామ పంచాయతీ పాలక మండలి పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాకేష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ భవనంలో వీడుకోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తహశీల్దార్ శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ రాయపర్తి గ్రామాన్ని మండలంలో, జిల్లాలో, రాష్ట్రస్థాయిలో గుర్తింపు తేవడానికి తమకు సహకరించిన ప్రజలకు, పాలక మండలికి కృతజ్ఞతలు తెలిపారు. ఐదు సంవత్సరాల కాలంలో గ్రామ అభివృద్దే ధ్యేయంగా పాలన కొనసాగించిన్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు అత్యంత విశ్వాసంతో నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి క్షణం గ్రామం కోసం పనిచేయడం జరిగిందని తెలిపారు. ప్రజా సేవలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతి ప్రజా ప్రతినిధి ఐదు సంవత్సరాలు వారు అందించిన సేవలను ప్రజలు గుర్తిస్తారని ఇది నిరంతర ప్రక్రియ అని వివరించారు. అనంతరం కార్యదర్శి సమక్షంలో వార్డు సభ్యులను, కో అప్షన్ సభ్యులకు శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు బిల్లా రాధిక సుభాష్ రెడ్డి, ఐత రాంచందర్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.