నవతెలంగాణ – వీర్నపల్లి
వీర్నపల్లి మండల శాంతి నగర్ గ్రామం సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ, మండల కాంగ్రెస్ నాయకులు అధ్యక్షులు బానోతు రాజు నాయక్ గ్రామస్తుల అధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ శాంతి నగర్ డైరెక్టర్ బానోతు కల్పన, వైస్ చైర్మన్ లక్ష్మన్, డైరెక్టర్ లు భూక్య సంతోష్, భూక్య రాజేందర్ లను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్, యూత్ మండల అధ్యక్షులు తిరుపతి లకు శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్బంగా డైరెక్టర్ కల్పన మాట్లాడుతు రైతులకు నిరంతరం అండగా ఉంటు వారి అభివృద్ధి కృషీ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు ప్రకాష్ నాయక్, కార్యదర్శి సాయి కృష్ణ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు సంతోష్ నాయక్, పూజారి గన్య నాయక్, గ్రామ పెద్దలు లింబ్య నాయక్, శంకర్, నరసయ్య, గ్రామస్తులు, తండ పెద్దలు ఉన్నారు.