– లాబీల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తాను మంత్రి పదవి కోసం పైరవీలు చేయనని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వరరెడ్డిలకు, రాజగోపాల్‌రెడ్డికి మధ్య బుధవారం అసెంబ్లీ లాబీల్లో సరదా సంభాషణ చోటు చేసుకుంది. ముందుగా ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. రాష్ట్రంలో అసలు గేమ్ ఇప్పుడే స్టార్టయ్యిందంటూ రాజగోపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్‌నుద్దేశించి సెటైర్ వేశారు.ఆ గేమ్ కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైందా? లేక రాష్ట్ర ప్రభుత్వంలోనా అంటూ ఆయన్ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జైలుకుపోయే జాబితాలో మొదటి వ్యక్తిగా ఉన్నారని తెలిపారు. తాము కేసీఆర్ లాగా ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20, 30 కోట్లుచ్చి కొనలేమంటూ తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు రూ.300 కోట్లు ఖర్చు చేసి కర్ణుడిని ఓడించినట్టు తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రభావం బీఆర్‌ఎస్‌పై పడిందనీ, అందుకే కేసీఆర్ అధికారాన్ని కోల్పోయారని చెప్పారు. రాజగోపాల్ అన్నా…నీవెప్పుడు సీఎం ఎప్పుడవుతున్నావ్ అంటూ ఎమ్మెల్యేలు అడగ్గా, ముఖ్యమంత్రి అయ్యేదుంటే కావొచ్చు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.