కరీంనగర్ ఎంపీగా పోటీ చేయను

– సోషల్ మీడియా ప్రచారంలో వాస్తవం లేదు  శ్రీనుబాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
కరీంనగర్ ఎంపీగా తాను పోటీ చేస్తున్నట్లుగా ఇటీవల సోషల్ మీడియా,పలు దినపత్రికల్లో వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని దానిని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తన తండ్రి స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు రాజకీయ వారసత్వాన్ని తన సోదరుడు దుద్దిళ్ల శ్రీదర్ బాబు కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో తన తండ్రి వారసత్వాన్ని తన సోదరుడు నిలబెడుతూ తనదైన రాజకీయ గుర్తింపును విజయవంతంగా రూపొందించుకున్నారన్నారు. తాను ప్రస్తుతం మంథని ప్రజలకు సేవలందించడంలో నిమగ్నమైట్లుగా, అలాగే కొనసాగిస్తానని పేర్కొన్నారు.తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి తన అన్నతో కలిసి పనిచేయడం గొప్ప అవకాశంగా బావిస్తున్నట్లుగా తెలిపారు.