
నవతెలంగాణ- భీంగల్ : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను నియోజకవర్గంలో ఖచ్చితంగా అమలు చేస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. సోమవారం శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం(లింబాద్రి గుట్ట) వద్ద పూజలు నిర్వహించి బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ లను అమలు చేస్తామని బాండ్ పేపర్ పై సంతకం చేశారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ తాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టి ప్రకటించిన ఆరు గ్యారంటీలను నియోజకవర్గంలో ఖచ్చితంగా అమలుచేస్తాననీ, నియోజకవర్గ అభివద్ధి కోసమే పునరంకితం అవుతానని, యదావిధిగా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటాననీ, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతానని. నిస్వార్థంగా అవినీతికి ఏమాత్రం తావులేకుండా పారదర్శకంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం, బాల్కొండ నియోజకవర్గ పురోగతికి విశేషంగా కృషి చేస్తానని నింబాచల లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.