నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గం లోని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇప్పిస్తానని తెలిపారు. అధికారులతో మాట్లాడుతూ గ్రామాల్లో నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో వస్తున్న వదంతులను ఎవరు నమ్మవద్దని.కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని నిజమైన లబ్ధిదారులను గుర్తించి న్యాయం చేస్తుందని తెలిపారు.