
కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన సెల్ఫీ కేంద్రంలో “నేను ఓటు వేస్తాను ఎందుకంటే నేను ఇండియాను ప్రేమిస్తాను” అనే నినాదంతో ఏర్పాటుచేసిన సెల్ఫీ కేంద్రంలో శుక్రవారం జనరల్ అబ్జర్వర్ మనోజ్ కుమార్ మాణిక్యరావు సూర్యవంశీ ఐఏఎస్, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఫోటో దిగారు. ఈ సందర్భంగా ఓటు ప్రాధాన్యత అందరూ గుర్తించాలని, అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత, కలెక్టరేట్ ఏవో మధుసూదన్ రెడ్డి, ఎన్నికల సూపర్డేంట్ శ్రీనివాసరాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వాలి.ఎన్నికలు సజావుగా, సమర్థవంతంగా నిర్వహించాలి.ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా కలెక్టర్, ఎస్.పి లతో కలసి పరిశీలన.

జిల్లాలో లోక్ సభా ఎన్నికలు సజావుగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బందికి నాణ్యమైన శిక్షణ అందించాలని 13- నల్గొండ పార్లమెంట్ నియోజక వర్గ సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మనిక్ రావు సూర్యవంశీ అన్నారు. శుక్రవారం ఎస్.వి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొని శిక్షణ తీరును, పోస్టల్ ఓటింగ్ సెంటర్ అలాగే డి.ఆర్.సి సెంటర్ ను పరిశీలించారు. తదుపరి రామలింగేశ్వర థియేటర్ వద్ద హోమ్ ఓటింగ్ నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. జిల్లాలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో చేసిన ఏర్పాట్లు అన్ని అద్భుతంగా ఉన్నాయని జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. అంతకు ముందు కొత్త మార్కెట్ యార్డులో గల స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్, యస్.పి. రాహుల్ హెగ్డే లతో కలసి పరిశీలించి పోలింగ్ యంత్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో అదనపు యస్.పి. నాగేశ్వర రావు, ఆర్.డి.ఓ వేణు మాధవ్, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.