
నియోజవర్గ ఎమ్మెల్యే గా అవకాశం కల్పించాలని కోరుతూ మండలంలోని పతేపూర్ గ్రామానికి చెందిన తలారి పోచన్న న్యాయవాది కాంగ్రెస్ పార్టీ తరపున గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ.. పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేసి ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా నని, అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపినారు.