
బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చేందుకు నిర్విరామ కృషి చేస్తానని సామ నవీన్ తెలిపారు. తెలంగాణ బిసి సంక్షేమ సంఘం ఎన్ఆర్ఐ కతర్ ముప్కాల్ మండల అధ్యక్షునిగా సామ నవీన్ ను రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ గౌడ్ ఆదేశానుసారం నియమించినట్టు బిసి నాయకులు గగ్గుపల్లి శ్యామ్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా సామ నవీన్ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షుల ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షులు బట్టు స్వామి గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని బిసి ఎన్ఆర్ఐ లకు ఎటువంటి సమస్యలు వచ్చిన వారికి అండగా ఉంటానని ఎల్లవేళలా సంక్షేమ సంఘం కోసం పాటుపడతారని సామ నవీన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బట్టు స్వామి ఎన్ఆర్ఐ బీసీ అధ్యక్షులు గురాయి రాజేంధర్ ఎన్ఆర్ఐ బీసీ కతర్ అధ్యక్షులు, సల్ల ఉపేంద్ర గంగన్న రాకేష్ ఎంకన్న మహేందర్ చిన్న గంగన్న సురేందర్ గణేష్ బీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..