నవతెలంగాణ – ఆర్మూర్
సమస్యల పరిష్కారానికై నిర్విరామ కృషి చేస్తానని బిజీ సంక్షేమ జిల్లా అధ్యక్షులు సుంకం భూషణ్ అన్నారు. బీసీ , ఎస్సి , ఎస్టీ , మైనారిటీ సంక్షేమ వేదిక జిల్లా కార్యవర్గం ఎన్నిక రాష్ట్ర అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించి, వారికి నియామక పత్రాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా ఎస్సి , ఎస్టీ , బీసీ , మైనారిటీలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.పార్టీలకు రాజకీయాలకు అతీతంగా వెనక బాటుకు గురైన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ మేరకు వేదిక జిల్లా అధ్యక్షునిగా మండలంలోని పి ప్రీ గ్రామానికి చెందిన సుంకం భూషణ్ నియమించి అభినందించారు. జిల్లా ప్రధాన కార్యదర్శులుగా ఆప్కారి రాజన్న , ఉషమ్ జై రాం , జిల్లా ఉపాధ్యక్షులుగా కారం పూరి రవి కుమార్ , రాథోడ్ సుందర్ సింగ్ , గొల్లపల్లి జగన్ గౌడ్ వడ్లూరి శైలజ , రజక సంగం సాయిలు జిల్లా అధికార ప్రతినిధిగా బాలేకార్ మనీష్ తేజ , కార్యదర్శులుగా వై . అనిల్ కుమార్ , చింతకింది సంతోష్ , కుంచెపు ఆనంద్ , సరిచంద్ మేఘవత్ , చిన్నజీ నవీన్నూ కార్యనిర్వాహక కార్యదర్శి గా నియమించి నియామక పాత్రలు అందించారు. ఈ కార్యక్రమంలో బిసి,, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.