భువనగిరి కోటను సందర్శించిన ఐఏఎస్ 2023 బ్యాచ్ అధికారులు..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణ క్యాడర్ కు చెందిన ఏడుగురు అసిస్టెంట్ కలెక్టర్స్ కమారి ఎన్.ఉమా హారతి, ఆజ్మేరా సంకేత్ కుమార్, కమారి గరిమా నరుల, అభిజ్ఞాన్ మాలవీయ, అజయ్ యాదవ్, మృణాల్ శ్రేష్ట, ఐ.ఇ.ఎస్.ఎస్.డి.మనోజ్ (IAS -2023 బ్యాచ్) తెలంగాణ దర్శనిలో భాగంగా మంగళవారం నాడు జిల్లాలోని భువనగిరి కోటను సందర్శించి విశేషాలను తెలుసుకున్నారు. అనంతరం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ్మస్వామి వారిని దర్శించుకున్నారు. తదుపరి కొలనుపాక లోని జైన దేవాలయం, సోమేశ్వరాలయం సందర్శించారు. వారి వెంట స్టేట్ నోడల్ అధికారి పెద్దబోయిన శ్రీనివాస్, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి జి.సురేష్, ఆలేరు తహశీలుదారు శ్రీనివాస్, టూరిజం డిపార్టుమెంటు గైడ్ వినోద్ వెంట ఉన్నారు.