ఐఎఎస్ అధికారిణి స్మీతా సబర్వాల్ ను సర్వీస్ నుండి తొలగించాలి

– బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ డిమాండ్ 
నవతెలంగాణ కంఠేశ్వర్
తెలంగాణ రాష్ట్రంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషించిన ఐఎఎస్ అధికారిణి స్మీతా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆమెను ప్రభుత్వ సర్వీస్ నుండి రిలీవ్ చేయాలని, కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకొని సబర్వాల్ ను ఐఎఎస్ సర్వీస్ నుండి తొలగించాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ద్వారా నిర్మితమైన అఖిల భారత కేంద్ర సర్వీసుల్లో అత్యంత కీలకమైన పాత్ర పోషించే ఒక ఐఎఎస్ అధికారిణి స్మీతా సబర్వాల్ తన స్థాయిని దిగజారి దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ఘటనగా భావించి  ఆమెపై వెంటనే కేసు నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ నుండి రిలీవ్ చేయాలని, కేంద్రం ప్రభుత్వం ఐఎఎస్ అధికారిణి సర్వీస్ నుండి తొలగించాలని
దండి వెంకట్ డిమాండ్ చేశారు.