నవతెలంగాణ – భీంగల్
మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలను అందజేసి వారికి ఆదాయ మార్గాలను చూపాలని ఐకెపి సిబ్బందికి ట్రైన్ ఐఎఎస్ సాంకేతి కుమార్ సూచించారు. బుధవారం మండలంలోని రహత్ నగర్, సికింద్రాపూర్, పెద్దమ్మకాడి తండా గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాలలో జరుగుతున్న ఉపాధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలతో చిన్న చిన్న వ్యాపారాలు చేపట్టి ఆర్థిక అభివృద్ధి సాధించాలని తెలియజేశారు. మహిళా సంఘాల సభ్యులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారికి ఆదాయ మార్గాలను చూపించాలని ఐకెపి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ, ఎంపీడీవో సంతోష్ కుమార్, ఏపిఎం రవీందర్ , ఏపీ ఓ నరసయ్య, ఎంపీ ఓలు గంగ మోహన్, సీసీలు, కుంట శ్రీనివాస్, పూరస్తూ నరేష్ కార్యదర్శి మాధవి టెక్నికల్ అసిస్టెంట్ రమేష్ రత్నాకర్, మహిళా సంఘాలు సభ్యులు, రైతులు , యువకులు పాల్గొన్నారు.