నవంబర్‌ 5న ఐఏయు 50కిమీ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌

ఐఏయు

హైదరాబాద్‌ : ప్రతిష్టాత్మక ఐఏయు 50 కిమీ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు హైదరాబాద్‌ వేదిక కానుంది. అంతర్జాతీయ అల్ట్రా రన్నర్స్‌ సంఘం నిర్వహిస్తోన్న ఈ పోటీలు నవంబర్‌ 5న ట్యాంక్‌బండ్‌పై జరుగనున్నాయి. భారత క్రీడా దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, పుల్లెల గోపీచంద్‌ ఈ పోటీలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఐఏయు అధ్యక్షుడు నదీం ఖాన్‌ వెల్లడించారు. కార్యక్రమంలో ఏఎఫ్‌ఐ అధ్యక్షుడు సుమారివాల్ల పాల్గొన్నారు.