– వరల్డ్‌కప్‌లో కివీస్ స్టార్ జోరు
దుబాయ్ : న్యూజిలాండ్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్ర కెరీర్ తొలి ఐసీసీ పురస్కారం దక్కించుకున్నాడు. 23 ఏండ్ల రచిన్ రవీంద్ర 2023 ఐసీసీ ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్నాడు. ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచుల్లో అదరగొట్టిన రచిన్ రవీంద్ర ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (అక్టోబర్) నిలిచాడు. అక్టోబర్‌లో రచిన్ రవీంద్ర 81.20 సగటుతో 406 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్‌పై 123, ఆస్ట్రేలియాపై 116 పరుగులతో మెరుపు శతకాలు బాదాడు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ మాథ్యూస్ ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచింది. అక్టోబర్‌లో ఆసీస్‌పై 155 సగటుతో 310 పరుగులు చేసింది మాథ్యూస్. మెన్స్ విభాగంలో జశ్‌ప్రీత్ బుమ్రా, క్వింటన్ డికాక్‌లను వెనక్కి నెట్టి రచిన్ రవీంద్ర అవార్డును దక్కించుకున్నాడు.