నవతెలంగాణ హైదరాబాద్: ఫోన్ పే యాప్ లో తన ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్లకు యూపీఐలో తక్షణ క్రెడిట్ను అందించడం కోసం ఆ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఐసిఐసిఐ బ్యాంక్ నేడు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా లక్షలాది మంది ఐసిఐసిఐ బ్యాంక్ ప్రీఅప్రూవ్డ్ కస్టమర్లు ఫోన్పే యాప్లో షార్ట్ టెర్మ్ క్రెడిట్ లైన్ను తక్షణమే యాక్టివేట్ చేసుకుని, యూపీఐ లావాదేవీలను సజావుగా, సురక్షితమైన పద్ధతిలో చేసుకోవడం కోసం దీనిని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. బ్యాంక్ యూపీఐలో ?2 లక్షల వరకు క్రెడిట్ లైను 45 రోజుల రీపేమెంట్ తో ఇచ్చేందుకు సిద్ధమైంది. పండగ సీజన్ లో ఎలక్ట్రానిక్స్, ట్రావెల్, హెూటల్ బుకింగ్స్, బిల్ పేమెంట్లు లాంటి ఎన్నో అధిక ధర వస్తువులను కొనే శక్తిని కస్టమర్లకు ఇచ్చేలా ఈ సౌకర్యాన్ని ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ ప్రొడక్ట్ హెడ్ నీరజ్ ట్రాయిషావాలా దీనిపై మాట్లాడుతూ, “లక్షలాది మంది కస్టమర్లకు సాఫీగా, సులభంగా క్రెడిట్ సౌకర్యం కల్పించడానికి ఫోన్పేతో జట్టు కట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఫోన్పేలో తమ పండగ షాపింగ్ అవసరాలకోసం పేమెంట్లు చేసేందుకు మా ఐసీఐసీఐ బ్యాంక్ ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్లు తక్షణమే క్రెడిట్ లైనన్ను యాక్టివేట్ చేసుకోవచ్చు.