ఐసీఐసీఐ లాంబర్డ్‌కు రూ.390 కోట్ల లాభాలు

హైదరాబాద్‌: ఐసీఐసీఐ లాంబార్డ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 12 శాతం వృద్థితో రూ.390 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.349 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ1లో సంస్థ స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం (జిడిపిఐ) 19 శాతం పెరిగి రూ.6,387 కోట్లుగా చోటు చేసుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,370 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. పెట్టుబడులపై ఆదాయం 27 శాతం పెరిగి రూ.621 కోట్లుగా నమోదయ్యింది.