నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని చేపూర్ గ్రామ శివారు క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల, పేపాల్ ఫౌండేషన్ కలిసి సంయుక్తంగా ఐసీటీ వర్క్ షాపును బుధవారం ప్రారంభించడం జరిగింది. ఈ వర్క్ షాప్ ఈనెల 24వరకు జరగనుంది. ఈ కార్యక్రమానికి ఐసీటీ అకాడమీ కి చెందిన తెలంగాణ హెడ్ గోపాల్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రధాన ఉపన్యాసం చేశారు. ఆయన ప్రసంగిస్తూ ఐసీటీ పరిజ్ఞానంతో సేల్స్ ఫోర్స్ సంబంధించిన ఉద్యోగాలు ఎలా పొందవచ్చో విద్యార్థులకు సోదాహరంగా వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సేల్స్ ఫోర్స్ టెక్నాలజీస్ టూల్స్ పై శిక్షణ ఇవ్వనున్నారు. క్షత్రియ విద్యాసంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విద్యార్థులు ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీల పట్ల లోతైన అవగాహనను పొందేందుకు, ఐసీటీ టెక్నాలజీ వంటి అంశాల పైన వర్క్ షాప్స్ ఉపయోగ పడతాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు కక్షత్రియ కాలేజీ లో అనుక్షణం నిర్వహిస్తున్నామని, మార్కెట్లో క్షత్రియ విద్యాసంస్థల విద్యార్థులు సాంకేతికంగా వస్తున్న మార్పుల్ని ముందుగానే అంచనా వేయడంలో ముందుంటారని అన్నారు. ప్రిన్సిపాల్ రామ్ కింకర్ పాండే మాట్లాడుతూ ఐసీటీలో అనేక ఉద్యోగాలు ఏర్పడుతున్నాయని కాబట్టి విద్యార్థులు ఈ టెక్నాలజీని నేర్చుకోవాలని మరింత పరిజ్ఞానం నుండి పొందాలని తద్వారా ఉద్యోగం పొందడం చాలా సులభతరం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఐసీటీ అకాడమీ నుండి ధీరజ్, సతీష్ కుమార్ లు, ,గౌస్ పాష శిక్షకులుగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో టీనీఓ సునీల్ గటాడి, వివిధ విభాగాల అధిపతులు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.