నవతెలంగాణ – చండూరు
చండూరు మున్సిపల్ పరిధిలోని లక్కినేనిగూడెం గ్రామానికి చెందిన సిపిఐ సీనియర్ నాయకులు ఈద లచ్చయ్య (75)మృతి బాధాకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. మంగళవారం లక్కినేనిగూడెం గ్రామంలో ఈద లచ్చయ్య మృత దేహం పై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సందర్భంగా నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఈద లచ్చయ్య చిన్ననాటి నుండి తాను చనిపోయేంతవరకు ఎర్రజెండా నీడలో ఉండి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి అని, పార్టీకి తీసిన సేవలు కొనియాడారు. లచ్చ య్యకు నివాళులర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య. మండల పార్టీ సహాయ కార్యదర్శి బొడ్డు వెంకటేశ్వర్లు, సిహెచ్ ఉషయ్య, గంట రమేష్,దోటి వెంకన్న, దోటి యాదయ్య,కారింగు శివలింగం తది తరులు పాల్గొన్నారు.