నవతెలంగాణ హైదరాబాద్ : అసోచామ్ (ASSOCHAM) 18వ వార్షిక బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టార్ లెండింగ్ సదస్సు & అవార్డుల కార్యక్రమంలో ఐడిబిఐ బ్యాంక్ మూడు అవార్డులను గెలుచుకుంది. బ్యాంక్ మిడ్-సైజ్ బ్యాంక్ విభాగంలో ‘‘బెస్ట్ డిజిటల్ ఇనిషియేటివ్స్’’లో విజేతగా, ‘‘బెస్ట్ రిస్క్, సైబర్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్’’, ‘‘బెస్ట్ ప్రొడక్ట్/సర్వీస్ ఇన్నోవేషన్’’లో రన్నరప్‌గా నిలిచింది. ఈ అవార్డులను భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్, అసోచామ్ అధ్యక్షుడు, NaBFID మేనేజింగ్ డైరెక్టర్ జి.రాజ్‌కిరణ్ రాయ్, ఇతర ప్రముఖుల సమక్షంలో, భారతీయ రిజర్వు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్ చౌదరి నుంచి ఐడిబిఐ బ్యాంక్ డిఎండీ సురేష్ ఖతన్‌హర్ అందుకున్నారు.