పాఠశాలకు ప్యూరిపయర్ వితరణ చేసిన ఐడిబిఐ బ్యాంకు ..

IDBI Bank distributed Puripair to the school.నవతెలంగాణ – గీసుగొండ

గీసుగొండ మండలంలోని శాయంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ అందించిన ఐడిబిఐ బ్యాంక్ యజమాన్యం ఈ సందర్భంగా జెడ్పిహెచ్ఎస్ శాంపేట హెచ్ఎం సంపత్ రావు మాట్లాడుతూ ఐడిబిఐ బ్యాంక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. శాయంపేట వాసి దాడి శివ అనుసంధానంతోనె సాధ్యం అయిందని అన్నారు. అనంతరం ఐడిబిఐ బ్యాంక్ సిబ్బందిని శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐడిబిఐ బ్యాంక్ డిజీఎం రాహుల్, ఆర్ ఎం పవన్ , శాయంపేట ఎంపిపిఎస్ హెడ్ మాస్టర్ రాజేశ్వరి, కార్యదర్శి రవికుమార్ , కారోబార్ కనకచారి పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.