ఆలోచన

హిమశిఖరం లా నిను నిలిపేది…
స్వర చరణంలా నిను నడిపేది….
నీ ఆలోచనా కిరణమే…
నీ ఆచరణాత్మక గమనమే….
వేకువ కొమ్మకు పూచిన
విశ్వాస సుమ పరిమళాలను
ఆస్వాదించు..
ప్రభాత రథం పై కొలువుదీరి
కళలు పంచే సూర్య ప్రతాపాన్ని ధరించు…
హరిత వేణు లయల సరిగమలుగా సాగే
అవని నయన తేజాన్ని ఎదన నిలుపు…
ఉదయ నది గలగలల మధురిమలకు
శతి కలిపే విపంచి ధ్వనిని ఆలకించు…
నిరాశా మేఘాల నీరస భావనా పద ధునులు కాదు వినవలిసింది…
అడుగడుగున ఆటంకపు కంటకాలు
ఎదురవురున్నా
తీరం చేరాలను ఆరాటంతో రెక్కులుతొడుక్కునే ఆశల కెరటంలా ఆకసాన్ని తాకు..
ఈ ధరణి పై నీ జన్మ, ఓటమికి కుంగిపోవడానికి
అపజయాలకు వెన్ను చూపడానికి కాదు….
ఆకసాలకు ఎగిరే రెక్కలు నీలో దాగి ఉన్నాయని మరువకు..
పాకడం కాదు.పిడికిలి బిగించి ఊపిరి పీల్చి ఆకసాల్ని దాటు…
– వెల్ముల జయపాల్‌ రెడ్డి, 9441168976