ఎంపికైన విద్యార్థులకు ఆదర్శలో ప్రవేశాలు..

– ఆదర్శ విద్యాలయ ప్రధానాచార్యులు హర్జీత్ కౌర్
నవతెలంగాణ – బెజ్జంకి
ఏప్రిల్ 16న ఆదర్శ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 25 నుండి 31 వరకు ప్రవేశాలు నిర్వహిస్తున్నట్టు ఆదర్శ విద్యాలయ ప్రధానాచార్యులు హార్జీత్ కౌర్ మంగళవారం తెలిపారు.ఎంపికైన విద్యార్థుల వివరాలు విద్యాలయ అవరణంలోని నోటీస్ బోర్డ్ పై అందుబాటులో ఉన్నాయని..ఆసక్తిగల విద్యార్థులు తమ ఒరిజినల్ దృవపత్రాలతో ప్రవేశం పొందాలని హార్జీత్ కౌర్ సూచించారు.