ఆదర్శం, భవితకు మార్గం

మోడల్ స్కూళ్లకు పెరుగుతున్న ఆదరణ
– ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ
– ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష
– 6 నుంచి 10వరకు ప్రవేశాలకు అవకాశం
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ఆదర్శ పాఠశాలలకు గ్రామీణ విద్యార్థులను ఇంగ్లీషు మీడియంలో తీర్చిదిద్దుతున్నారు.ఇందులొసం ప్రవేశ పరీక్ష నిర్వహించి పాఠశాలల్లో చేర్చుకుంటున్నారు. అనుభజ్ఞులైన ఉపాధ్యాయుల బోధనలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. ఇక తెలంగాణ మోడల్ స్కూల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీ సీట్లను కూడా భర్తీని ప్రవేశ పరీక్ష ద్వారా చేపట్టనున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా ఆంగ్లమాద్యమంలో విద్య బోధన అందించేందుకు అప్పటి ప్రభుత్వం 2013లో మోడల్ స్కూళ్ళు (తెలంగాణ ఆదర్శ పాఠశాలలు) నెలకొల్పింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 12 మోడల్ స్కూళ్ళు ఉన్నాయి.ఒక్కొక్క పాఠశాలలో ప్రతి సంవత్సరం 6వ తరగతిలో 100 మందికి ప్రవేశం కల్పిస్తారు.టిఎస్ఎంఎస్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు కొనసాగుతాయి.
దరఖాస్తులు ఇలా..ఆరో తరగతితోపాటు ఇతర తరగతుల్లో అడ్మిషన్ల కోసం ఫిబ్రవరి 22వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.విద్యార్థులు కేవలం ఆన్ లైన్ వెబ్సైట్ htpp:||telanagana ms cgg,gov,in మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు కోసం ప్రస్తుతం వారు చదువుతున్న పాఠశాల నుంచి బోనో పైడ్, ఆధార్ కార్డు,కుల,నివాస,ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో మిసేవా కేంద్రాల్లో కానీ,ఇంటర్ నెట్ సెంటర్లలో దరఖాస్తులు చేసుకోవచ్చు.ఆన్ లైన్ లో దరఖాస్తుకు తుది గడువు ఫిబ్రవరి 22.వివరాల అనంతరం పత్రాలను పాఠశాలల్లోని ప్రిన్స్ పాల్ కు అందజేయాలి.ఎప్రి4 1వ తేదీలోగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి.ఏప్రిల్ 7న జిల్లా కేంద్రంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.6వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7 నుంచి 10వ తరగతి విద్యార్థులు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు ప్రవేశ పరీక్ష ఉంటుంది.రాత పరీక్ష తెలుగు,ఇంగ్లీష్ లో ఉంటుంది.100 మార్కులు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.6వ తరగతికి ఒక్కొక్క పాఠశాలలో వందమందికి ప్రవేశం ఉంటుంది.దీంతో పాటు 7 వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బడి మానేసిన ఖాళీ సీట్ల కోసం ప్రవేశానికి అవకాశం ఉంటుంది.
ప్రత్యేకతలు ఇవే.. ఎటువంటి రుసుము లేకుండా ఆంగ్లమాద్యమంలో ఉత్తమ విద్యా బోధన. పక్కా భవనంతో తరగతి గదులు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం. ఉచితంగా ప్రభుత్వమే పాఠ్య పుస్తకాలు,యూనిపామ్ లను అందజేస్తోంది. 8వ తరగతి విద్యార్థులకు జాతీయ ఉపకార వేతనాలకు,ప్రతిభ పరీక్షలకు  ప్రత్యేక శిక్షణ. సైన్స్,కంప్యూటర్, ల్యాబ్ తోపాటు లైబ్రరీ సదుపాయం.10వ తరగతి విద్యార్థులకు ఎన్ టి ఎస్ఏ కు ప్రత్యేక శిక్షణ తరగతులు వంటి సదుపాయాలు ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవాలి ..దూడ వెంకటేశ్వర్లు, ఎడ్లపల్లి మోడల్ స్కూల్ ప్రిన్స్ పాల్.
అర్హులైన పేద విద్యార్థులు మోడల్ స్కూల్లో ప్రవేశాలకు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం.తుది గడువు ఫిబ్రవరి 22 వరకు.అన్ని వసతులతో కూడిన ఆదర్శ పాఠశాలల్లో చక్కటి విద్య లభిస్తుంది. ఇంగ్లీష్ మీడియం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరం లాంటిది.నిస్థాతులైన ఉపాధ్యాయులచే బోధన ఉంటుంది.ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి.