గ్రామీణ ప్రాంతాల నుండి ఆదర్శవంతమైన క్రీడలు 

– రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడలు  ఆదర్శవంతమైన క్రీడలుగా నేడు ముందుకు వెళ్తున్నాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ మండలంలోని పొతరం ఎస్ గ్రామంలో చేపట్టిన జిల్లా స్థాయి కబడ్డీ క్రీడ జట్టు పోటీల కార్యక్రమంలో పాల్గొన్నారు. కబడ్డీ క్రీడాకారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ కబడ్డీ అడారు . ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ  పోతారం గ్రామంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. శారీరకంగా మానసికంగా క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.గ్రామీణ ప్రాంతాల నుండి ఆదర్శవంతమైన క్రీడలు నిర్వహించడం వల్ల ఊర్లో చైతన్యం పెరుగుతుందన్నారు. ఈ కబడ్డీ  పోటీలు విజయవంతం కావాలని అంతా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, పిసిసి సభ్యులు కేడం లింగమూర్తి, మండల అధ్యక్షుడు బంక చందు, స్థానిక ప్రజాప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం : హుస్నాబాద్ పట్టణంలోని  సివి రామన్ స్కూల్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని  మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం వైద్య శిబిరంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పరీక్షలు చేసుకున్నారు. అందరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మీరు మెయింటెన్ చేస్త అంటే ఒక అంబులెన్స్ కొనిస్తానని తెలిపారు. లైన్స్ క్లబ్ అయితే పారదర్శకంగా నిర్లక్ష్యం లేకుండా నడుస్తుందని అన్నారు. మీరు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తా మంటే స్థానిక శాసనసభ్యునిగా అన్ని ఏర్పాట్లు   చేస్తానని హామీ ఇచ్చారు.