
నవతెలంగాణ-బెజ్జంకి
జిల్లాస్థాయి సబ్ జూనియర్ అథ్లేటిక్స్ లో మండల ఆదర్శ విద్యాలయ విద్యార్థినిలు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్టు పీడీ కనుకారెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా అథ్లేటిక్స్ అసోషియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన షార్ట్ పుట్ లో నవ్య(బంగారు, వెండి పథకం), ప్రియ, హరిప్రియ కాంస్య పథకాలు సాధించారని కనుకారెడ్డి తెలిపారు.పథకాలను సాధించిన విద్యార్థిలను ఇంచార్జీ ప్రధానాచార్యులు సంగీత, బోధన సిబ్బంది అభినందించారు.