ఈనెల 26 నుండి అమలు కానున్న ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ ఈ నాలుగు పథకాల అమలు కోసం మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్ గ్రామసభలో నివేదికను చదివి ప్రజలకు వినిపించారు. ఈ గ్రామసభ గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి మండల అభివృద్ధి అధికారి రాణి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నాగరాజ్ డిప్యూటీ తాసిల్దార్ భారత్ ఏఈఓ సౌమ్య నాయకులు దరాస్ సాయిలు చౌలవార్ హనుమాన్లు స్వామి గడ్డం వార్ లక్ష్మణ్ వివిధ శాఖల అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.