– మండలంలో 98.27 ఎకరాలు గా నమోదు….
– ఏవో శివరాం ప్రసాద్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వం రైతు భరోసా అమలు చేయడానికి వ్యవసాయ సాగు భూములను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. మండలాల వారీగా రెవిన్యూ,వ్యవసాయ శాఖల సిబ్బంది సర్వే నెంబర్ లు,సబ్ డివిజన్ లు వారీగా తనిఖీలు చేసారు. ఈ నేపద్యంలో అశ్వారావుపేట మండలంలో తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ పర్యవేక్షణలో వ్యవసాయశాఖ మండలాధికారి శివరాం ప్రసాద్,ఆర్ఐ క్రిష్ణ,ఏఈవో సతీష్ లు ఆదివారం నాటికి తనిఖీలు పూర్తి చేసారు. వ్యవసాయాధికారి శివరాం ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో 30 పంచాయితీలలో 4 వ్యవసాయ క్లస్టర్ లలో 19 రెవిన్యూ గ్రామాలు పరిధిలో 130 సబ్ డివిజన్ లలో మొత్తం 37,071 ఎకరాల వ్యవసాయ సాగు భూములను తనిఖీలు చేసారు. ఇందులో 98.27 ఎకరాలలో లే అవుట్, గృహాలు, పలురకాల వ్యాపార సముదాయాలు తో వ్యవసాయేతర భూములుగా గుర్తించినట్లు తెలిపారు. ఆసుపాక 40.55,అశ్వారావుపేట 32.72,నారాయణపురం 12.10,మద్ది కొండ 7.06,నారం వారి గూడెం 3.07,గుంటిమడుగు 1.10,రామన్నగూడెం 1.00,వేదాంత పురం 0.12 మొత్తం 98.21 ఎకరాలు గా నమోదు చేసారు.