
నిజం సాగర్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ శ్రీధర్ మరియు నర్సింలు ఆధ్వర్యంలో మరియు ప్రధాన ఉపాధ్యాయుడు రాంచందర్ సమక్షంలో బడిబయట పిల్లల సర్వేలు గురువారం నిర్వహించారు. అందులో భాగంగా ఆరు సంవత్సరాల నుండి 14 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఇద్దరు పిల్లల్ని గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించడం జరిగింది. సుల్తాన్ నగర్ గ్రామంలో లక్ష్మణ్ అనే వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడం వల్ల అతని కుమారుడైన అర్జున్ తల్లి ఊరిలో లేకపోవడం వలన పాఠశాలకు దూరమయ్యాడు అలాగే అదే గ్రామానికి చెందిన గౌస్ అనే పిల్లవాడు వాళ్ల తల్లిదండ్రులు హైదరాబాదుకి వలస వెళ్లడం వల్ల అతను కూడా పాఠశాలకు దూరమయ్యారని వారు తెలిపారు. వారికి పాఠశాలలో చేర్పించి ఒక్కో జత యూనిఫామ్ అందజేయడం జరిగిందని వారు తెలిపారు. వాళ్లకి రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలకు రావాలని ఉపాధ్యాయులు పిల్లలకు ప్రోత్సహించడం జరిగింది. ప్రతిరోజు పిల్లలకు పాఠశాలకు పంపే విధంగా తల్లిదండ్రులకు తగు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని క్లస్టర్ రిసోర్స్ పర్సన్ శ్రీధర్ తెలిపారు.