ఏర్గట్ల మండలంలోని ఆయా గ్రామాల్లో తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో బడి బయట పిల్లల గుర్తింపు కార్యక్రమాన్ని విద్యాశాఖ వారు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏర్గట్ల మండల సీఆర్పీలు మహేంధర్, గంగాప్రసాద్ సర్వేను నిర్వహించారు. విద్యా హక్కు చట్టంలో భాగంగా విద్యార్థులకు ఉచిత విద్య, పుస్తకాలు, దుస్తువులు, మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం అందిస్తున్నారని, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని,విద్యను అభ్యసించాలని సూచించారు.