నవతెలంగాణ – భీంగల్ రూరల్
భీంగల్ మండలంలోని చెంగల్ గ్రామంలో శుక్రవారం రోజున FSC ఆహార భద్రత కార్డు సర్వే, రైతు భరోసా సర్వే పరిశీలించిన అదనపు కలెక్టర్ అంకిత్. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో అన్ని గ్రామాల్లో సర్వే బృందాలు ఏర్పాటు చేసి రైతు భరోసా, ఆహార భద్రత కార్డులపై సర్వే కొనసాగుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా కచ్చితమైన గైడ్‌లైన్స్ విడుదల చేస్తోంది అని వాటిని సరిగ్గా అర్థం చేసుకోకపోతే, లబ్దిదారులు పథకం ప్రయోజనాలు మిస్సవుతారు. ఇప్పుడు రైతు భరోసా విషయంలో అదే జాగ్రత్తతో ఉండాలి. ఈ పథకాన్ని జనవరి 26, 2025న ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పింది. అందువల్ల ఈ సర్వే చేపట్టడం జరిగింది. ఈ సర్వే ద్వారా అర్హులైన రైతులను గుర్తిస్తారు.రైతు భరోసా పథకం కింద రైతులు, కౌలు రైతులకు ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి రూ.12,000 చొప్పున ఇస్తామని చెప్పింది. ఎన్ని ఎకరాలు ఉంటే, అన్ని ఎకరాలకూ ఇస్తామని అంది. కానీ.. ఎకరాలు సాగుకి అనుకూలమైనవి అయి ఉండాలి అని కండీషన్ పెట్టింది. రైతులు తమ దగ్గర సాగుకి యోగ్యంగా ఉన్న అన్ని భూములూ చూపించాలి. లేదంటే.. పంట ఉన్న వాటినే రాసుకొని అధికారులు.. అంతవరకే భరోసా ఇచ్చే అవకాశం ఉంటుంది.ఒకవేళ అధికారులు తనిఖీ, సర్వే కోసం వచ్చినప్పుడు సంబంధిత పొలాల రైతు అందుబాటులో లేకపోతే, అధికారులు తాము తయారుచేసిన లిస్టును ప్రకటించకముందే, ఆయా గ్రామ సభల్లో ఆ జాబితాను ప్రకటిస్తారు. అప్పుడు మిస్సయిన రైతులు ఆ జాబితాను పరిశీలించి, ఏదైనా సమస్య ఉంటే అధికారులకు చెప్పొచ్చు. అప్పుడు వాళ్లు పరిశీలించి, సమస్యలను సరిచేస్తారు. అందువల్ల ఇవాళ్టి నుంచి 3 రోజులు.. రైతులు అప్రమత్తంగా ఉండి, తమ దగ్గరున్న వ్యవసాయ యోగ్యమైన పొలాలను చూపించాలి. తనిఖీ బృందాల్లో పంచాయతీ రాజ్, మండల రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.