– అఫ్గనిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం
కాబుల్: మహిళా స్వేచ్ఛ, సమానత్వంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు చవిచూస్తున్నా.. అఫ్గానిస్థాన్‌ను ఏలుతున్న తాలిబన్లు మాత్రం తాము అనుసరిస్తున్న విధానాలపై వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ఈ నెలాఖరులో ఆరంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌లో అఫ్గాన్ నుంచి పురుష అథ్లెట్లు మాత్రమే పోటీపడతారని, మహిళా క్రీడాకారులను గుర్తించబోమని తెలిపారు. ‘అఫ్గానిస్థాన్ నుంచి ముగ్గురు అథ్లెట్లు (పురుషులు) మాత్రమే ఒలింపిక్స్ బరిలో నిలిచారు. ప్రస్తుతం మా దేశంలో మహిళల క్రీడలను ఆపేశాం’ అని ప్రశ్నించాడు. విశ్వక్రీడల్లో అఫ్గాన్ నుంచి ఆరుగురు బరిలో నిలువగా ఇందులో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. మరో ఐదుగురు అఫ్గాన్ జాతీయ జట్టుకు కాకుండా శరణార్థుల జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు.