తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణరెడ్డిని గుర్తించండి..

– తెలంగాణ ఉద్యమ నాయకులు, ప్రజాసంఘాల నేతలు..
నవతెలంగాణ  భువనగిరి కలెక్టరేట్                      
స్వరాష్ట్ర తెలంగాణ సాధన కోసం తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలుకి వెళ్లి ఆరోగ్యాలను ఆస్తులను కోల్పోయిన తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణరెడ్డి తో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమ కారులను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించి సరైన న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకులు, ప్రజాసంఘల నాయకులు కేతావత్  తిరుపతి నాయక్,  సేవర్తి మధు, యాసా సంతోష్ రెడ్డి, బానోతు లింగయ్య నాయక్ కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం నిరంతరం పోరాటం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమనేత, యువజన సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు యువజన అవార్డు గ్రహీత జిట్టా బాలకృష్ణరెడ్డి తోపాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న వారి పేర్లను పరిశీలించి ఉద్యమ కారులను సముచిత స్థానం కల్పించి న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించి తన యావదాస్తిని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఖర్చు చేసి తెలంగాణ సాధకుడిగా మిగిలిన జిట్టా బాలకృష్ణారెడ్డికి సమచిత స్థానం కల్పించి వారికి న్యాయం చేయాలని, అలాగే పార్టీలకతీతంగా తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన వారందరికీ గౌరవం దక్కాల్సిన అవసరం ఉందని.. అప్పుడే తెలంగాణకు నిజమైన అర్థం అన్ని చెప్పుకొచ్చారు . ఆనాటి ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారస్తులపై, కవులు కళాకారులు రచయితల చేత తెలంగాణ ఉద్యమాన్ని ప్రభావితం చేసి గల్లి నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ యాస భాష తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలను చూపుతూ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి సబ్బండ వర్గాల ప్రజలను ఏకం చేసిన ఘనత జిట్టా బాలకృష్ణరెడ్డి కే దక్కుతుందని అన్నారు. ఆనాటి తెలంగాణ ఉద్యమాలను చూసిన నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించడం వెనుక ముమ్మాటికి జిట్టా బాలకృష్ణరెడ్డి ముఖ్య పాత్ర మాటలకు అందనిదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ప్రత్యక్ష పరోక్ష ఉద్యమాలలో పాల్గొని రాష్ట్రం సిద్ధించడానికి ప్రధాన కారకులు అయిన సంగతి ప్రస్తుత ప్రభుత్వాలు ప్రభుత్వాలు మర్చిపోవద్దని స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ సముచిత స్థానం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రొఫెసర్ కోదండరామ్ లను పత్రిక ముఖంగా కోరారు.