ముంబయి : విదేశాలకు పంపిన డబ్బు కోసం స్విఫ్ట్‌తో కలిసి రియల్ టైం ట్రాకింగ్ సేవలను అందిస్తున్నట్లు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తెలిపింది. ఇది భారత బ్యాంకింగ్‌లోనే తొలిసారి ఆవిష్కరణ అని పేర్కొంది. బ్యాంక్ మొబైల్ అప్లికేషన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఇది భారతీయ బ్యాంకింగ్ పరిశ్రమలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని ఆ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ చిన్మరు దోబ్లే పేర్కొన్నారు. సౌకర్యవంతమైన, సమర్థవంతమైన బ్యాంకింగ్ పరిష్కారాలను అందించడంలో తమ బ్యాంక్ నిబద్ధతను ప్రదర్శిస్తుందన్నారు.