నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలల్లో వికలాంగ విద్యార్థులకు 20 ఏండ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో విద్యాబోధన అందిస్తున్న ఐఈఆర్పీ ఉపాధ్యాయులను జీవో నెంబర్ 97 ప్రకారం ఉన్న ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు 1523లో విలీనం చేస్తూ క్రమబద్ధీకరించాలని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు సిలువేరి వెంకటేశం, ప్రధాన కార్యదర్శి కె కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీలో కలపడం వల్ల ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 996 మంది ఐఈఆర్పీ ఉపాధ్యాయులు ఉద్యోగాలను కోల్పోయే అవకాశముందని తెలిపారు. మానవతా దృక్పథంతో న్యాయం చేయాలని కోరారు.