నాలుగు సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు బడి ఈడు పిల్లలతో పనులు చేయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీఆర్పీలు జీడిమడ్ల సైదులు, చందపాక నాగరాజ్ అన్నారు. విద్యాశాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకుమండలంలో వివిధ గ్రామాల్లో బడి బయట ఉండే పిల్లల గుర్తింపు కోసం సిఆర్పిలు సర్వే చేసి బడికిరాని పిల్లల తల్లిదండ్రులకు కు అవగాహన కల్పించారు. పాఠశాల విద్యతో పాటు ఇంటర్ చదువులకు దూరంగా ఉన్న వారిని సర్వేలో 14 మందిని గుర్తించారు. ప్రభుత్వం విద్యార్ధులకు అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్నభోజనం, రవాణా భత్యం పై అవగాహన కల్పించారు .ఈనెల 10 నుంచి మొదలైన సర్వే ఈనెల 25 వరకు కొనసాగుతుంది అని తెలిపారు. గ్రామాలలో18 ఏళ్ల లోపు విద్యార్థులు బడులకు వెళ్లకుంటే తమకు సమాచారం తెలియజేస్తే విద్యార్థులను బడుల్లో చేర్పిస్తామని అన్నారు. 18 ఏండ్ల లోపు పిల్లలను పనులలో చేర్పించుకుంటే యజమానిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీలు పందుల నర్సింహ, ఐతగోని సతీష్, , ఐఈఆర్పి ఇడెం ఇందిరా పాల్గొన్నారు.