ఓ మనిషి యానిమల్‌గా మారితే..?

If a man becomes an animal..?రణబీర్‌ కపూర్‌, సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘యానిమల్‌’. ప్రీ-టీజర్‌తో ఆశ్చర్యపరిచిన మేకర్స్‌ గురువారం రణబీర్‌ కపూర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ని రిలీజ్‌ చేశారు. ఇది తండ్రీ కొడుకుల పాత్రల్లో కనిపించిన అనిల్‌ కపూర్‌, రణబీర్‌ కపూర్‌ల కథ. విలన్‌గా బాబీ డియోల్‌ ఎంట్రీ, పిల్లల గురించి రణబీర్‌, రష్మిక మందన్నల మధ్య చర్చ జరుగు తున్నప్పుడు చూపించిన రక్తపాతం, కారు ఛేజింగ్‌లు, ఇంటెన్స్‌ ఎలిమెంట్స్‌ చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాయి. అలాగే రణబీర్‌ రెబల్‌గా మారే క్రమాన్ని దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తన మార్క్‌తో ప్రజెంట్‌ చేశారు. మొత్తంగా ఈ టీజర్‌ సినిమాకి ఓ గ్లింప్స్‌లా ఉండటం విశేషం. భూషణ్‌ కుమార్‌, క్రిషన్‌ కుమార్‌ టి-సిరీస్‌, ప్రణరు రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.