మొటిమల సమస్యకు ఇంట్లోనే కొన్ని చిట్కాలతో చెక్ పెట్టొచ్చు. వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం..
ముల్తానీ మట్టి..
ముల్తానీ మట్టి డెడ్ స్కిన్ సెల్స్‌ని తొలగించడంలో హెల్ప్ చేస్తుంది. ఇందులోని ప్రత్యేక గుణాలు చర్మాన్ని మెరిపించేం దుకు హెల్ప్ చేస్తుంది. ముఖంపై జిడ్డుని తొలగించేందుకు ముల్తానీ మట్టి చాలా మంచిది. దీని వల్ల చర్మ సమస్యలు, మొటిమలు దూరమవుతాయి.
విటమిన్ ఇ
విటమిన్ ఇ కూడా స్కిన్ అండ్ హెయిర్‌కి మంచిది. ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని కాపాడుతుంది. ఇది డ్రై స్కిన్‌కి చాలా మంచిది. హైడ్రేషన్ అందిస్తుంది. మొటిమలను దూరం చేసి స్కిన్‌ని క్లియర్ చేస్తుంది.
అలోవెరా..
అలోవెరా చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది. ఈ జెల్‌ని కూడా ముఖానికి రాసు కోవచ్చు. దీని వల్ల చర్మ సమస్యలు దూరమవు తాయి. ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు దూరం చేసి కాంతివంతంగా మారుస్తుంది.
రోజ్ వాటర్..
రోజ్ వాటర్ కూడా మంచి టోనర్‌లా పని చేస్తుంది చర్మాన్ని కాంతివంతంగా చేయడంతో పాటు చర్మంపై వద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి మేలుచేస్తాయి. మొటిమలను తగ్గిస్తాయి.