చర్యలు తీసుకోకపోతే ఎదురు దాడి తప్పదు 

If action is not taken, a counter attack is inevitable– బీజేపీ నేతలపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలి 
– అక్బర్ పేట భూంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు 
–  కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్  
నవతెలంగాణ – దుబ్బాక రూరల్ 
రాహుల్ గాంధీపై వివాదాస్పద వాఖ్యాలు చేసిన  బీజేపీ నేతలపై కేంద్ర హోంశాఖ తగిన చర్యలు తీసుకోకాపోతే కాంగ్రెస్ పార్టీ నుండి  ఎదురు దాడి తప్పదని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్  హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, దేశ ప్రధాన ప్రతిపక్ష నేతైన రాహుల్ గాంధీపై బిజెపి నేతలు చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలకు నిరసనగా అక్బర్ పేట భూంపల్లి పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా  వారు విలేకర్లతో మాట్లాడుతూ కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావ్ నిత్ బిట్టు రాహుల్ గాంధీని దేశంలో నెంబర్ వన్ టెర్రరిస్ట్ అని, మరో బిజెపి నేత తన్వీందర్ సింగ్ దేశ ప్రతి పక్షానేతైనా రాహుల్ గాంధీకి మీ నాయనమ్మ గతే పడుతుందని వివాదాస్పద వాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. మరోవైపు మహారాష్ట్ర శివసేన షిండే వర్గానికి చెందిన సంజయ్ గైక్వాడ్ ఏమ్మెల్యే రాహుల్ గాంధీ  నాలుక కోస్తే 11 లక్షలు ప్రకటించడం చూస్తే బిజెపి చిత్తశుద్ధి దేశంలో అల్లరి సృష్టించడానికి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు.తాము కాంగ్రెస్ పార్టీ పక్షాన బీజేపీ నేతలు చేసిన వాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
 కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దుబ్బాక మాజీ ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు మంద చంద్రసాగర్, సీనియర్ నాయకులు మదగని వెంకట్ యాదవ్, బోయిని పర్శరాములు, మైపాల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.