నవతెలంగాణ-భిక్కనూర్ : మద్యం సేవించి వాహనాలు నడిపితే శాఖ పరమైన చర్యలు తప్పవని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. బుధవారం రాత్రి మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఇద్దరిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వాహనదారులు సరైన వాహన పత్రాలు, హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా పోలీసులకు సహకరించాలని, గురువారం సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమాను విధించినట్లు పోలీసులు తెలిపారు.