– కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జెల కాంతం ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో దళితులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు కొనసాగుతుంటే, మంద కష్ణ మాదిగ ఎక్కడ ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జల కాంతం ప్రశ్నించారు. ఆ దాడులపై ఎందుకు మాట్లాడం లేదని నిలదీశారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేత సతీష్ మాదిగతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. రిజర్వేషన్లు లేకుండా చేసి దేశాన్ని పాలించాలని కలలు కంటున్న బీజేపీకి మందకృష్ణ మద్దతు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనికి నిరసనగా ఈనెల 4న భారత రాజ్యాంగ రక్షణ దీక్ష చేయబోతున్నట్టు తెలిపారు.