గోషామహల్ లో బండి సంజయ్ పోటీచేస్తే చిత్తుగా ఓడిస్తాం…

– గోషామహల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ నందకిషోర్ వ్యాస్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిస్తుందని నియోజ కవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్ నందకిశోర్ వ్యాస్ బిలాల్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అభివృద్ధి, ప్రగతి, సం క్షేమంతో నియోజకవర్గ ప్రజలంతా బీఆర్ఎస్ వైపే మొగ్గుచూపుతున్నారన్నారు.  గోషామహల్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ.. బండి సంజయ్ చేసిన ప్రకటనతో ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంత్రి కేటీఆర్ గోషామహల్ నుంచి బరిలోకి దిగితే రాజా సింగ్ ఓడిస్తారని బండి సంజయ్ పేర్కొనడం ఆయన అవివేకమన్నారు. మంత్రి కేటీఆర్ ను విమర్శించే స్థాయి బండి సంజయ్ కు లేదన్నారు. రాజాసింగ్ కానీ, బండి సంజయ్ కానీ ఇతర ఏ బీజేపీ నాయకుడు బరిలో దిగినా తమ కార్యకర్తలు,నాయకులంతా ఏకమై బీజేపీని చిత్తుగా ఓడిస్తామన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలోనే కోట్లాది రూపాయాల అభివృద్ధి పనులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో చేపట్టామన్నారు. బీజేపీతో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఎస్. ధన్ రాజ్, మహిళా అధ్యక్షురాలు శీలం సరస్వతి, జయశంకర్, అనిత, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, అన్సారీ. శేఖర్ చారి. తది తరులు పాల్గొన్నారు.