
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
పిల్లల ఆరోగ్యం బాగుంటేనే సమాజం బాగుంటుందని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కొందరు చిన్నారులకు స్వయంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పోలియో చుక్కలు వేశారు.చిన్నారులకు బిస్కిట్ పాకిట్స్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…పిల్లల ఆరోగ్యం బాగుంటేనే సమాజం బాగుంటుందిని, ఇది చాలా మంచి కార్యక్రమం అన్నారు.5 సంవత్సరాల లోపు పిల్లలు అంగవైకల్యం (పోలియో) రాకుండా పోలియో చుక్కలు తప్పని సరి వేయించుకోవాలని కోరారు. పోలియో చుక్కలు వేసేందుకు వైద్య బృందం, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లు, అంగన్ వాడి టీచర్లు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారన్నారు.గ్రామాలలో జనాభా ప్రతిపాదికన ఒకటి నుండి 5 సెంటర్ల వరకు ఏర్పాటు చేసి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నందున 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరారు.ఈ రోజు పోలియో చుక్కలు వేసుకోలేని పిల్లలు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి కూడా పోలియో చుక్కలు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి బీమా జమున, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ రమేష్, వేల్పూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నీరడి భాగ్య, సామ మహిపాల్ రెడ్డి, పార్టీ ప్రెసిడెంట్ ప్రతాప్, మండల, స్థానిక నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.