అధికారంలోకి వస్తే 6గ్యారెంటీలు అమలు

– అకాంగ్రెస్‌ భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి విస్తృత ప్రచారం
నవతెలంగాణ-భువనగిరి
కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 6గ్యారెంటీల హామీలను అమలు చేయనుటన్నట్లు కాంగ్రెస్‌ భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్బినగర్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను నెరవేరుస్తుందన్నారు. మహిళలకు రైతులకు ప్రధాన పీఠ వేస్తున్నారు. పగలు ఆశీర్వదించి కాంగ్రెస్‌ చెయ్యి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ తంగళ్ళపల్లి శ్రీవాణి పీసీసీ సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ దొనకొండ వనిత పాల్గొన్నారు. అలాగే భువనగిరి పట్టణంలోని లందగుట్ట సమస్యలు పరిష్కరిస్తారని కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి కూతురు కీర్తి రెడ్డి తెలిపారు. మంగళవారం ఆమె వార్డులలో పర్యటిస్తూ మహిళలను కలుసుకున్నారు వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కషి చేస్తానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యల పరిష్కారమయి భువనగిరి అభివృద్ధి చెందుతుంది అని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి చేగూర్‌ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నాయకులు పాల్గొన్నారు.