– కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గం అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గం అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం కందుకూరు మండలం నేదునూరు గేటు వద్ద చందుపట్ల నరసింహారెడ్డి కల్యాణ మండపంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సభావాత్ కృష్ణానాయక్ అధ్యక్షతన ప్రజల ఆశీర్వ సభ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రైతు కూలీలకు, కౌలు రైతులకు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏడాదికి రూ.12 వేలు అందజేస్తామన్నారు. ఇంటింటికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని హామీనిచ్చిన సీఎం కేసీఆర్ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఇండ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. వివాహం చేసుకోబోయే ఆడబిడ్డకు లక్షా నగదు, అత్తకు రూ.4 వేలు, కోడలుకు రూ.2500లు అందజేస్తామన్నారు. రేషన్ షాపులో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ 9 వస్తువులతో కూడిన బియ్యం ఇవ్వడం అందజేస్తామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చి, అమలు చేయకపోవడంతో ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం ఏరులై పారుతుందని, కళాశాలలో డ్రగ్స్ సరఫరా అవుతుందని విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, రాష్ట్ర నాయకులు అమరేందర్ రెడ్డి, జెడ్పీ మాజీ జిల్లా ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి, నియోజకవర్గ నాయకులు దేపి భాస్కర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు సులేమాన్, ఎండి అజీజ్, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.