రైతులకు ఎరువులను అధిక ధరలకు అమ్మితే చర్యలు..

– జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు 
నవతెలంగాణ – నెల్లికుదురు 
రైతులకు ఎరువులను ఎమ్మార్పీ ధరలకే కాకుండా అధిక ధరలకు అమ్మినట్లయితే ఎరువుల చట్టం ప్రకారం అతనిపై చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి అభిమాన్యుడు  తెలిపాడు. మండలంలోని  ఎరువుల షాపులను ఎరువుల తనిఖీలో భాగంగా మండలంలోని మన గ్రోమోర్, లక్ష్మీ ఫర్టిలైజర్స్, శ్రీరామ ఫర్టిలైజర్స్, ధనలక్ష్మి ఫర్టిలైజర్స్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మేచరాజుపల్లి షాపులలో యూరియా, డి ఎ పి నిలువల తనిఖీని గురువారం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఈపాస్ నిలువలు, గోదాము నిలువలు సరిపోలి ఉన్నాయా లేవా అని పరిశీలించినట్లు తెలిపారు.  డీలర్లు అందరూ కూడా ఎరువులను ఎమ్మార్పీ ధరలకు మాత్రమే రైతులకు అమ్మాలి. అధిక రేటులకు అమ్మిన వారిపై చట్టమైన చర్యలు ఉంటాయని అన్నారు. రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు తెలిపారు. ఏ ఒక్కరు కూడా రైతులను మోసం చేసి సొమ్ము చేసుకోవాలని చూసిన వారిపై ఎరువుల చట్టము ప్రకారము చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నెలకుర్తి రవీందర్ రెడ్డి వ్యవసాయ విస్తరణ అధికారులు డీలర్లు పాల్గొన్నారు.