
కొత్తగా ఆటవీ భములు దున్నేందుకు ప్రయత్నించవద్ మండలంలోని పోచారం,విట్టల్ వడి,విట్టల్ వడితాండల గ్రామాల మధ్య ఉన్న అటవీ భూమిని కొంతమంది గిరిజనులు గత రెండు రోజుల క్రితం ఇష్టానుసారంగా రాత్రివేళలో ట్రాక్టర్ల దున్నడంతో ఆయా గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.ఈ సమాచారాన్ని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు విట్టల్వాడి గ్రామంలో గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు ఎఫ్ఆర్ఓ సంతోష తెలిపారు.అటవీ భూములను అక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోడు భూముల పట్టాలు రాని వారు ఇదే ఆసరాగా తీసుకొని అటవీ భూములను దున్నినా నేరమని తెలిపారు. అదేవిధంగా కొత్తగా పోడు భూమి పట్టాలు వచ్చినవారు ఇష్టానుసారంగా దున్నుకోవద్దని పట్టాలు ఇచ్చిన దాంట్లోనే ఉండాలని మళ్లీ కొత్తగా భూములను దున్నితే లేదా ఫారెస్ట్ భూమిని స్వాధీనం చేసుకునేలా వ్యవహరిస్తే అలాంటి వారిపై అటవీ శాఖ చట్టం కింద నిబంధనల మేరకు చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే అటవీ ప్రాంతాలు అన్యాక్రాంతంగా ఉన్నాయని తెలిపారు. ఎవరైనా పోడు భూములు పట్టాలు కాకుండా ఫారెస్ట్ భూమిని దున్నితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ సంతోష, అటవీ శాఖ అధికారిసుజాత, ఎమ్మార్వో దశరథ్, ఎస్సై కోనారెడ్డి, ఎంపీఓ సురేకాంత్, ఏఎస్ఐ రాములు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.