ఈ కాలంలో అల్లం తీసుకుంటే…

ఈ కాలంలో అల్లం తీసుకుంటే...చాలావరకు వంటల్లో మనం అల్లం వాడుతుంటాం. అల్లంలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌, ప్రోటీన్‌, విటమిన్లు బి3, బి6, ఐరన్‌, పొటాషియం, విటమిన్‌ సి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లుతో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిలో జింజరాల్‌ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. చలికాలంలో అల్లం రసం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. తరచూ అల్లం రసం తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందో చూద్దాం.?
ఇమ్యూనిటీ బూస్ట్‌ చేస్తుంది: అల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో జింజరాల్‌ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అల్లంలో రోగనిరోధక పనితీరును మెరుగుపరిచే యాంటీ బాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి. ఇది జలబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి: అల్లం జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, మెరుగైన జీర్ణక్రియ, పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఉబ్బరం, అజీర్ణం, వికారం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
శ్వాసకోశ సమస్యలను దూరం: అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలో మంట, జలుబు, వైరల్‌ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శ్వాసనాళాన్ని క్లియర్‌ చేస్తుంది. గొంతు నొప్పిని తగ్గించి, దగ్గు నుంచి ఉపశమనం ఇవ్వడానికి సహాయపడతాయి.
బ్లడ్‌ షుగర్‌ కంట్రోల్‌: అల్లంలోని ఔషధ గుణాలు ఇన్సులిన్‌ విడదలకు, సెన్సిటివిటీకి సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచడానికి తోడ్పడతాయి. డయాబెటిస్‌ ఉన్నవారు రోజూ అల్లం రసం తాగితే మేలు జరుగుతుంది.
గుండెకు మంచిది: అల్లం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిలను, రక్తపోటును తగ్గిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
నెలసరిలో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది: నెలసరి సమయంలో అల్లం రసం తీసుకోవడం వల్ల నొప్పులు నియంత్రణలో ఉంటాయి. అధిక రక్తస్రావాన్ని అరికట్టే సుగుణాలు దీనిలో ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
మెదడు పనితీరు మెరుగుపడుతుంది: అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడానికి సహాయపడతాయి. తరచూ అల్లం రసం తీసుకుంటే.. అది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గుతారు: రోజూ అల్లం రసం తాగితే.. బరువు కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు అంటున్నారు. అల్లం జీవక్రియను పెంచుతుంది, ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది.