ఒక్కసారి అవకాశం ఇస్తే సేవకుడిగా పనిచేస్తా

– కల్వకుర్తి అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి
– కడ్తాల్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ-ఆమనగల్:  ఒక్కసారి అవకాశం ఇస్తే సేవకుడిగా పనిచేస్తానని కల్వకుర్తి అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కడ్తాల్ మండలంలోని పిల్లి గుండ్ల తండా, వెలుగు రాళ్ల తండా, గడ్డమీది తండా, కొండ్రిగాని బోడు తండా, రేఖ్యా తండా, టాకురాజుగూడ తదితర గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి ఆచారి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి తనను ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని వేడుకున్నారు. ఐదు సార్లు ఓటమి పాలైన అధైర్యపడకుండా ఆరవసారి బరిలో నిలుస్తున్న తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని ఆయన ఓటర్లను వేడుకున్నారు. ఈసందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఆచారి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.